సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచం అంత ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా ఎన్నికల ఫలితాల్లో నేడు, బుధవారం ఉత్కంఠ వీడింది. అమెరికా ప్రజలు ఎలాంటి అపోహలకు తావులేకుండా ట్రాంప్ కు ఘన విజయం చేకూర్చి స్పష్టమైన తీర్పు చెప్పారు. 538 ఎలక్టోరల్ ఓట్లు కలిగిన అమెరికాలో అధ్యక్షుడి పీఠం అధిరోహించాలంటే 270 ఓట్లు సాధించాలి. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ మెజార్టీ మార్క్ దాటి 280 స్థానాల్లో లీడ్ కనబరుస్తోంది. దీంతొో అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో ట్రాంప్ ఇప్పటికే విజయోత్సవ సభ లో మాట్లాడుతు.. అమెరికన్లకు నా హయాంలో ఇక సువర్ణ యుగం రాబోతుంది. ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు ఎంతో శ్రమించారు. ఘన విజయం అందించిన అమెరికన్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపై ఇష్టం వచ్చినట్లు ఎవరు ఇతర దేశస్తులు అమెరికాలో ప్రవేశించలేరు. నా కష్ట కాలంలో నావెంట ఎలాన్ మాస్క్ అండగా నిలిచారు. నా విజయంలో కీలక పాత్ర ఆయనదే.. అని ప్రశంసించారు. ఇక అమెరికా ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి నేతలు భారీ విజయాలు సాధించారు . సుహాస్ సుబ్రమణ్యం, అమీ బేరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జైపాల్, శ్రీ తానేదార్ లు అమెరికా ప్రతినిదుల సభకు ఎన్నికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *