సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన 50 శాతం సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన వేళ భారత్ దేశంలో స్టాక్ మార్కెట్ దారుణ నష్టాలకు లోనయ్యింది. ట్రంప్ ఇంత దూకుడుగా పన్నులు పెంచుతూ పోతున్న కూడా కారణాలు ఏవైనా.. భారత్ ప్రధాని మోడీ ఎదురుదాడి చెయ్యడం కానీ, దానికి కౌంటర్ గా ఇండియా కూడా చైనా తరహాలో అమెరికా దిగుమతులపై భారీ టాక్స్ లు పెంచడం కానీ ఇప్పటి వరకు చెయ్యలేదు. ఇది దేశ ఆర్ధిక నిపుణులకు మింగుడు పడటం లేదు. ( చైనా టాక్స్ ల ఎదురు దెబ్బకు అమెరికా మరో 6 నెలలు టాక్స్ లు పెంపు ఫై స్టే విధించుకొంది మరి) అయితే అమెరికా విధించిన ఈ అదనపు టారిఫ్‌లు, జరిమానాలతో తక్షణం ప్రభావితమయ్యే రంగాలను రక్షించుకునేందుకు మోదీ సర్కారు చర్యలు చేపట్టింది. మన జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు వంటి ఎగుమతులపై రష్యా, ఇంగ్లాండ్, బెల్జియం, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, పోలండ్‌వంటి 40 దేశాల్లోమన ఉత్పత్తుల నాణ్యత తెలియజేస్తూ ప్రమోషన్ ప్రోగ్రామ్‌లు నిర్వహించబోతున్నట్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి.అంటే మరి మన ఎగుమతి దారులు అంతవరకూ నష్టాలు చూడక తప్పదు.. పెట్రోల్ రష్యా నుండి చౌక గా కొంటె అది మన దేశంలో ప్రజలకు పెట్రోల్ రేట్లు తగవు.. కానీ అమెరికా టాక్స్ లు పెంచితే మాత్రం ఇప్పటికే మన ఉత్పత్తులకు రైతులకు ఆర్ధికంగా దెబ్బ మాములుగా లేదు..మన ప్రధాని మోడీ చైనా పర్యటన తరువాత ఏమైనా నిర్ణయాత్మక మార్పులు రావచ్చు.. వేచి చూద్దాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *