సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా వాస్తవ దృష్టితో అందరు ఆలోచించవలసిన విషయం.. రాష్ట్రంలో ఎక్కడ చుసిన ఆడపిల్లలపై విస్తుపోయే రీతిలో అత్యాచారాలు , దాడులు ఎక్కువయ్యాయి. అవి వార్తలుగా వెయ్యడానికి కూడా దారుణంగా ఉంటున్నాయి అన్నది వాస్తవం.. ఎంతమంది మృగాలకు శిక్షలు పడుతున్నాయో ? తప్పించుకొంటున్నారో? కానీ.. ఈ సైకో మృగాళ్లకు భయం లేకుండా పోతుంది అన్నది వాస్తవం.. తాజాగా నేడు, శుక్రవారం ప్రేమికుల రోజు పురస్క రించుకొని అన్నమయ్య జిల్లా గుర్రం కొండా మండలంలో , ప్రేమ పేరుతో ఓ మృగాడు ఓ యువతిపై అత్యంత దారుణంగా దాడి చేసి ఆమె తలపై కత్తితో పొడిచి, నోట్లో యాసిడ్ పోసి చంపే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ అమ్మాయి చావుబ్రతుకుల మధ్య మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కోరుమిట్లు ఆడుతుంది. ప్రాధమిక విచారణలో స్థానికుల సమాచారం ప్రకారం.. అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇటీవల యువతికి పెళ్లి నిశ్చయం కావడం తో, అతడు సైకోగా అఠ్యంత దారుణంగా చంపే ప్రయత్నం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
