సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి లో రఘురామా కృష్ణంరాజు కు రాజకీయ ప్రాధ్యాన్యం కలిపించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు తప్పని పరిస్థితులలో ఉండి నియోజకవర్గం కేటాయించడం అనివార్యంగా మారింది. ఒకటి 2 రోజులలలో మంచి ముహర్తం చూసుకొని అధికారిక ప్రకటన రావడం ఒక్కటే తరువాయి. ఉండి సీటు రఘురామకృష్ణరాజు కు కేటాయించినట్లు నిర్దారణకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే రామరాజు గత 4 రోజులుగా ఎమోషనల్ అవుతున్నారు. కార్యకర్తలతో సమావేశమై వారి ముందు భావేద్వేగానికి గురి అవుతున్నారు. వారి సూచనలు వింటున్నారు. తన కుటుంబ సభ్యులు కూడా ఎట్టి పరిస్థితులలో ఉండి లో పోటీకి నిలబడి తీరాలని కోరుకొంటున్నారని తాజగా రామరాజు ( రాంబాబు) ప్రకటించారు. ఆయనకు టికెట్ మార్చకూడని అభిమానులు ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకొన్నారు. ఇప్పటికే టీడీపీ టికెట్ రాక భంగ పడ్డ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అయితే ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా వెనక్కి తిరిగి చూడకుండా ప్రచారంలో దూసుకొనిపోతున్నారు. అయితే, ఇప్పటి వరకు రామరాజు కోసం చంద్రబాబు తనను దూరంగా పెట్టారని బాధ పడిన శివరామరాజు ఇప్పుడు ఆ టికెట్ ఎంపీ రఘురామా కు కేటాయిస్తుండంతో కొంత ఉపశమించి పోటీ విరమించుకొంటారని రఘురామా వర్గీయులలో కొండత ఆశ ఉంది. ఇక రామరాజు కూడా చంద్రబాబు పట్ల గురుభావంతో తన టికెట్ త్యాగం చేసి పార్టీ ఆదేశాల ప్రకారం రఘురామా విజయానికి కృషి చేస్తారని పరిస్థితులు మరో వారం 10 రోజులలో పూర్తీ దారికి వస్తారని టీడీపీ వర్గాలలో కూడా ఆశాభావం వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉండగా ఎన్నికల నెలరోజుల ముందువరకు ఉండి టీడీపీలో 3వర్గాలలో ఇంత రచ్చ రచ్చ జరిగాక నేతలు కలవవచ్చును కానీ వారి క్యాడర్ సమన్వయ పడుతుందా? లేక కట్టప్పలు గా మారతారా? ‘తంతే బూరెల బుట్టలో పడ్డ’ సామెత చందాన.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పివిఎల్ నరసింహారావు కు పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొనేరాజకీయ పరిణితి, సత్తా ఉందా ? ఒకవేళ శివరామరాజు కూడా బరిలో ఉంటె..? రఘురామా కృష్ణంరాజు కటౌట్ ఉండి టీడీపీ క్యాడర్ ను,వారి బలమైన సామాజికవర్గాన్ని కూడా 3వారాలలో ప్రభావితం చేస్తుందా? వేచి చూడాలి.. నిర్వేదాలు.. ట్విస్టులు మాత్రం అదుర్స్..
