సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘ఆదిపురుష్’ టీజర్ వచ్చే సింది. గత ఆదివారం సాయంత్రం శ్రీరాముని జన్మస్థలం అయిన పవిత్ర అయోధ్య నగరంలో జరిగిన ఈవెంట్లో టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసారు శ్రీ రాముడి పాత్రధారి, హీరో ప్రభాస్ మరియు చిత్ర బృందం. ఈ సందర్భముగా డైరెక్టర్ ఓం ప్రకాష్ రావత్ మాట్లాడుతూ .. రామాయణం ఇతివృత్తం గా ఈ చిత్రం తెరకెక్కింది అయితే ‘సాధారణ సినిమాలా ఆదిపురుష్ తీయలేదు. దేవుడి పట్ట భక్తిని చాటుకోవడానికి ఈ చిత్రాన్ని తీశాను.అన్నారు. అనంతరం హీరో ప్రభాస్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అయోధ్యకు వచ్చి శ్రీరాముడు ఆశీర్వాదం తీసుకున్నాం .ఈ క్యా రెక్టర్ చేయడానికి మొదట భయం వేసింది. దేవుడు మీద ఉన్న భక్తి, ప్రమే, భయమే నన్ను ఈ సినిమా చేయించింది. మనిషిగా జీవించిన రాముడిని మనం దేవుడుగా విశ్వ సిస్తాం , ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు’ అన్నారు ప్రభాస్.. కాగా మైథలాజికల్ ఫిలింగా రూపొందించిన ఈ చిత్రం లో కృ తీ సనన్ సీతాదేవిగా కనువిందు చేయనుం ది. ఇక స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా అలరించనున్నా డు. కాగా సంక్రాంతి కానుగా వచ్చే జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా ట్రయిలర్ చుసిన ప్రేక్షకులు, తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా ఇది పూర్తీ గ్రాఫిక్ ఉన్న యానిమేషన్ చిత్రం లా ఉందేమిటి? ప్రభాస్ ఆలా బొమ్మలా కదలడమేమిటి? అని కొంత నిరాశ చెందుతున్నారు. ఇలాంటి 3 డి సినిమాలు పిల్లలకు నచ్చుతాయేమో? కానీ పెద్దలకు ఎంత మేర అలరిస్తాయి? దీనిపై పూర్తీ వివరణ రావలసి ఉంది..
