సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నర్నీపట్నం పండుగలో డప్పు కొడుతున్న ఓ వ్యక్తిపై కోపంతో ఊగిపోతూ అతనిని తిడుతూ చేయి చేసుకున్నట్లు ఆ వీడియో తెలుగు రాష్ట్రాలలో బాగా వైరల్ అవుతుంది. . ఈ నేపథ్యంలో పోలీసుల సమక్షంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓ వ్యక్తిపై చేయి చేసుకోవటం.. అత్యంత హేయమైన, బడుగులపై అహంకార చర్యగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో కొంతమంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇదే సమయంలో మరి ఏ కారణం చేతనో అయ్యన్న పాత్రుడి వివరణకు బదులుగా అతని చేతిలో చెంప దెబ్బ తిన్న . డప్పు కొడుతున్న వ్యక్తి ఘటనపై స్పందించి వీడియో విడుదల చేశారు. తాము చిన్నప్పటి నుంచి అయ్యన్నపాత్రుడి వద్ద ఓ కుటుంబంగా ఉంటున్నామని.. దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని ఆ వీడియోలో ప్రాధేయ్యపడ్డారు, ఏమి జరిగి ఉంటుంది?
