సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారము విజయదశమి నేపథ్యంలో .. ప్రతి ఏడాది లానే .. ఈసారి కూడా భీమవరంలో స్థానిక డి మార్ట్ ప్రక్కన స్థలంలో అయ్యప్ప దీక్ష చేసే భక్తులకు దీక్ష చేసిన అన్ని రోజులు ఉచిత అన్న సమారాధన ఏర్పటు చేసిన శిబిరాన్ని ప్రారంభించారు. నేడు, జరిగిన అయ్యప్ప పూజకు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్జక్షుడు కొటికలపూడి చినబాబు హాజరయ్యారు. వారికీ స్థానిక అయ్యప్పలు శ్రీ స్వామివారి ఫోటో ప్రసాదం ఇచ్చి సత్కరించారు. ఎన్నో ఏళ్లుగా ఎంతో నిష్ఠతో దాతల సహకారంతో ఇక్కడ అయ్యప్పలకు మండలం రోజులు బిక్ష ఏర్పాటు చెయ్యడం అభినందనీయం అని, ఇది దీక్ష చేసేవారికి ఇబ్బందులు లేకుండా ప్రోత్సహకారంగా ఉందని వారు నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తోట బోగయ్య, నిర్వాహకులు అయ్యప్పలు పాల్గొన్నారు.
