సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో నేటి శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..మాదల పంచాయతీ నంది వలస గ్రామం వద్ద పెద్దమ్మ గుడి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు.. రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. నందివలసలో జరిగిన జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు 15 ఏళ్ళ బాలురు మరియు మరో ఆరేళ్ల బాలుడు, నాలుగేళ్ల బాలుడు, 40 ఏళ్ళ వ్యక్తి తో సహా ఐదుగురు ఈ ప్రమాదంలో మృతి చెందారు.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.క్షతగాత్రులకు అరకులోయ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు , ఆరుకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *