సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసిన కేసులో ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు నేడు, బుధవారం సంచలనం తీర్పు ఇచ్చింది. గీతతోపాటు కీలక నిందితుడు అయిన ఆమె భర్త రామ కోటేశ్వరరావు కు కూడా ఇదే శిక్ష విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మోసం చేసిన కేసులో 2015లో చార్జిషీటు ఫైల్ చేశారు. దీని ఆధారంగా కోర్టు తీర్పు వెల్లడించింది. వీరికి సహకరించిన బ్యాంక్ అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవైట్ లిమిటెడ్ కంపెనీకు రూ. 2లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్తపల్లి గీత సహా మిగిలిన నిందితులను అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. వైసిపి ఎంపీ గా గతంలో గెలిచిన తరువాత ఆమె టీడీపీ, బీజేపీలతో మద్దతు కోసం దోబూచులాటలు… వంటి కొన్ని వివాదాస్వాద నిర్ణయాల వల్ల, తదుపరి స్వతంత్ర ఎంపీగా ఉంటానంటూ చేసిన వ్యాక్యలు నేపథ్యంలో అప్పుడే పార్టీకి పూర్తిగా దూరమైన విషయం గమనార్హం..
