సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఏపీలో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి లోను కలియుగ వైకుంఠం తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. అరసవిల్లిలో నేటి తెల్లవారు జామునుండి వేలాది భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనం ( ఫై చిత్రం అరసవల్లి ) చేసుకొంటున్నారు. తిరుమల లో నేటి మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. తిరుమలలో జరిగే ఉత్సవాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న రథసప్తమికి సుమారు 2న్నర లక్షలమంది వస్తారన్న అంచనాతో తరలివస్తున్న భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. నేటి ఉదయం నుండి రాత్రి వరకు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఉదయం నుండి ఎండ తీవ్రతతో ఇబ్బంది కలగకుండా షెడ్లు ఏర్పాటు చేసిన టీటీడీ, మాడ వీధుల్లో ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదం పంపిణీ చేటున్నారు. . రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు అన్న ప్రసాదాలు పంపిణీ నిరంతరంగా కొనసాగించనుంది.
