సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తమిళనాడు లోని ప్రసిద్ధ పుణక్షేత్రం అరుణాచలం యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా 4 డిపోల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం అవుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ వీరయ్య చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 5, ఏప్రిల్ 4, మే 3, జూన్ 2వ తేదీల్లో రాత్రి 7 గంటలకు సర్వీసులు బయలుదేరతాయని తిరిగి మార్చి 8, ఏప్రిల్ 7, మే 6, జూన్ 5వ తేదీ ఉదయం 7 గంటలకు ఆయా సర్వీసులు తిగిరి డిపోలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురంల మీదుగా అరుణాచలం చేరే సర్వీసు భీమవరం డిపో నుండి ఒక్కో టిక్కెట్ ధర రూ.2,500/- లునిర్ణయించగా, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల నుండి రూ. 2600/- గా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్నిభక్తులు ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *