సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య అనంతరం ఇరాన్–అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరగడంతో పొరుగు దేశాలే తమను అమెరికా తో జతకట్టి ముంచేశాయని, ముందు వారి పని పట్టాలని తీవ్ర ఆగ్రహంతో ఇరాన్ వందలాది మిసైల్స్ దాడుల నేపథ్యంలో.. గల్ఫ్ దేశాలకు చెందిన కీలకమైన ముడిచమురు ప్లాంట్ లను ఇరాన్ మిసైల్స్ తో పేల్చివేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ చమురు మార్కెట్లు కుదేలవుతున్నాయి. బ్రెంట్ ముడి చమురు ధరలు ఒక్కసారిగా దాదాపు 10 శాతం పెరిగాయి. తాజా నేడు సోమవారం ట్రేడింగ్‌లో బ్రెంట్ బ్యారెల్ ధర 78.52 డాలర్ల వరకు చేరింది. ఈ సంక్షోభంలో ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఇరాన్ సమీపంలోని హార్ముజ్ జలసంధి ద్వారా రోజుకు సుమారు 20–22 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ఈ మార్గంమూసివేయడంతో ముడిచమురు రవాణా ఖర్చులు, ముడి చమురు ధరలను గణనీయంగా పెంచుతుందని నిపుణులు హెచ్చరించారు. పరిస్థితి మరింత దిగజారితే బ్రెంట్ చమురు ధరలు బ్యారెల్‌కు 120–140 డాలర్ల వరకూ ఎగిసే అవకాశం ఉందని అంచనా వేశారు. భారత్ వంటి చమురు దిగుమతి ఆధారిత దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీ గా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
