సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ (Bird Flu) వైరస్ ఇంకా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో నరసరావుపేటలో చికెన్ తిన్న ఒక చిన్నారి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత మార్చి 4న ఒక 2 ఏళ్ళ బాలిక అనారోగ్యంతో బాధపడుతుండగా, తల్లిదండ్రులు ఆమెను మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మార్చి 16న ఆమె మృతి చెందింది. అయితే, తాజాగా వచ్చిన బాలిక స్వాబ్ శాంపిల్స్ ఆమెకు H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారణ చేశాయి. కోడిని కోస్తున్నప్పుడు బాలిక ఒక చిన్న చికెన్ ముక్క నోట్లో పెట్టుకుంది. ఆ మాంసం తిన్న కొద్దిసేపటికే చిన్నారికి అనారోగ్య లక్షణాలు కనిపించడం విశేషం. బర్డ్ ఫ్లూ వైరస్ మానవులకు సంక్రమించే సామర్థ్యాన్ని ఈ ఘటన నిరూపించింది. కాబ్బటి చికెన్ వండుకొనేవారు దానిని బాగా నీళ్లలో మరిగించి వాడుకొంటే మంచిది.
