సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక .. ఈనెలలో బ్యాంకులు (Banks) వరుసగా నాలుగు రోజుల పాటు మూసివేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మెబాట పట్టనున్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమ్మెకు పిలుపునిచ్చింది. మార్చి 23వ తేదీన అర్థరాత్రి నుంచి మార్చి 25 వరకు సమ్మె కొనసాగనుంది. దీంతో ఆ రెండు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మెకు పిలుపునిచ్చింది యూఎఫ్‌బీయూ. రెండు రోజుల పాటు ఈ సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకు సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. అయితే మార్చి 22న నాల్గవ శనివారం, తరువాత ఆదివారం బ్యాంకులకు సెలవులు. ఆపై మార్చి 24, 25 (సోమ, మంగళవారం) బ్యాంకుల సమ్మె నేపథ్యంలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నప్పటికీ ఆన్లైన్ సేవలు మాత్రం అందుబాటులో ఉండనున్నాయి. అలాగే ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.
