సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనానికి అనుబంధంగా ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇప్పటికే కోస్తా ఆంధ్ర లో భారీ వర్షాలు పడుతున్నాయి. భీమవరంలో నేటి గురువారం తెల్లవారు జాము భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రోడ్లు ఫై కూడా నీరు నిలిచి ఉంది. ప్రస్తుతం చిరుజల్లులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.
