సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం శాఖ ప్రకటించింది. ఇక, అల్ప పీడనం ప్రభావకం తో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని నెల్లూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్వతీపురం మన్యం , అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో వర్షాలు, ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందని ఇంకా పలు ప్రాంతాలలో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
