సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతం లో అల్పపీడనం ప్రభావం తో కోస్తా ఆంధ్ర లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. గత వారం రోజులుగా వర్షాలు ఊపందుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులతో పాటు వరి పంట చేతికొచ్చినవేళ కొందరి రైతులకు ఈ వర్షాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అయితే నెల రోజులుగా ఎండలు మండిపోవడంతో ప్రజలు మాత్రం ఆహ్లదం పొందుతున్నారు. ముఖ్యముగా గత 7 రోజులుగా గోదావరి జిల్లాలలో వాతావరణం పూర్తిగా చల్లబడటంతో పాటు దాదాపుగా అన్ని ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి. నిన్న, ఆదివారం నేడు, సోమవారం మధ్యాహ్నం భీమవరంలో ఉరుములు మెరుపులతో ఒక దుక్కు భారీ వర్షం కురిసింది.మరో రెండు మూడు రోజులు ఇదే తీరున వర్షాలు పడనున్నాయి. అయితే ఉదయం సాయంత్రం మాత్రం వర్షం పడకపోవడంతో వ్యాపారస్తులు కాస్త ఊపిరి తీసుకొంటున్నారు.
