సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది.. ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ వెల్లడిచింది.. దీని ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. నేటి శనివారం, రేపు ఆదివారం తెలుగు రాష్ట్రాలలో జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిచింది. ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అయితే అల్పపీడనం, రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. భీమవరం నరసాపురం సముద్ర తీరా ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచనలు చేశారు.
