సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే సెప్టెంబర్ 25న మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది సెప్టెంబర్ 27 నాటికి వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరం దాటే అవకాశం ఉంది. ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.గోదావరి జిల్లాలలోని తీరప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *