సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో .. భీమవరం పట్టణంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేటి మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు వర్షపు జల్లులతో ముసురు వాతావరణం నెలకొంది. రేపటి శ్రీ వినాయక చవితి కి వర్షం ఆహ్వానం పలికే అవకాశం ఉంది. వినాయక విగ్రహాలు అమ్మే వారు, పూజ సామాగ్రి అమ్మేవారు తగిన ఏర్పాట్లు మధ్య అమ్మకాలు కొనసాగితున్నారు.పూజ సామాగ్రి ధరలు, పువ్వుల ధరలు మాత్రం అంబరాన్ని తాకుతున్నాయి. యువత పోటాపోటీగా వినాయక విగ్రహాలను ఏర్పాట్లు చేసుకొంటున్నారు. రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ) విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, గోదావరి జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు (Heavy Rains) పడనున్నాయి.
