సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతం లో రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో ఏపీలో మరో నాలుగు రోజుల పాటు నాన్‌స్టాప్ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు సోమవారం ఉదయం భీమవరంలో భారీ వర్షం పడింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా విడతలుగా ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. తాజగా రుతుపవన ద్రోణి కి అల్పపీడనం తోడు కావడంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తా తీరంలో జోరువాన కురవడంతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.
