సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతం లో నేడు, శుక్రవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనంతో నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అతిభారీ, భారీ, మోస్తరు వర్షాలు కురిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు..
