సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉభయ గోదావరి జిల్లాలోప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు నాలుగురోజులపాటు కురుస్తాయని వాతావరణ విభాగం సూచన జారీ చేసింది. ఈ మేరకు డీపీఆర్వో కార్యాలయంనుంచి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనంవల్ల ఈనెల 11 వరకూ రాష్ట్రంలో పలు తీర జిల్లాలో మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు కురిసే అవకాశము న్నందున దూరప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వే సుకోవాలని, పిడుగులు పడే అవకాశమున్నందున ప్రజ లు అవసరమైతేనే బయటకు వెళ్లాలని, ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. భారీవర్షాలతోపాటు తీరం వెంబడి 50 నుంచి 70 కి.మీ వేగంతో గాలులు వీచే దృష్ట్యా మత్స్యకారులు సము ద్రవేటకు వెళ్లకుండా ఉండేలా మత్స్యశాఖ అధికారులు చూడాలని ఆదేశించారు.
