సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోస్తా తీరానికి కు ఆనుకుని పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికితోడు బిహా ర్, అసోంల నుంచి వేర్వేరుగా వాయువ్య బంగాళాఖాతం వరకు 2 ఉపరితల ద్రోణులు, కేరళ నుంచి గుజరాత్ వరకు అరేబియా సముద్ర తీరం వెంబడి మరో ఉపరితల ద్రోణి విస్తరించాయి. వీటి ప్రభావంతో ఏపీలో రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయి. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు, ఆదివారం లేదా రేపటి సోమవారం అల్పపీడనం ఏర్పడుతుందని భావిస్తున్నారు.దీని ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయన్నారు. ఇంకా ఈనెల 17వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. గోదావరి జిల్లాలలో వర్షలు మరింత విస్తారంగా పడనున్నాయి.
