సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళా ఖాతం లో ఏర్పడిన ఒరిసా, పశ్చిమ బెంగాల్ మధ్య సముద్రంలో ఉపరితల ఆవర్తనం అల్ప పీడనంగా మారుతున్నా నేపథ్యంలో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో నేడు బుధవారం విస్తారంగా వర్షాలు పడుతున్నాయ్. భీమవరంలో గత రాత్రి నుండి నేటి బుధవారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా ఒక మోస్తరు వర్షం చినుకులతో కురుస్తూనే ఉంది. ఇదే తరహా వర్షాలు మరో 4 రోజులు పాటు కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గాలులు కూడా 40-60 కిమీ పైగా వేగంగా వీచే అవకాశం ఉంది
