సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు తాజగా అల్లు అరవింద్ ( allu aravind, chandra babu) ఇంటికి వెళ్లి వారి కుమారుడు నూతన దంపతులుఅల్లు శిరీష్ (Allu Sirish), నయనికా రెడ్డి ల ను అశీర్వదించారు. ఇటీవల వారి వివాహాం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం దానికి సీఎం రేవంత్ రెడ్డి రావడం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ వేడుకకు హజరు కాలేక పోయారు.ఈ నేపథ్యంలో ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు గత శనివారం సాయంత్రం అల్లు అరవింద్ ఇంటికి స్వయంగా వెళ్లి . పూల బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడే కాసేపు ఉండి అరవింద్ కుటుంబ సభ్యలుతో కాసేపు గడిపారు. అయితే ఆ సమయంలో హీరో అల్లు అర్జున అక్కడ లేరు. ఈ సందర్భంగా అల్లు ఫ్యామిలీ సీఎం చంద్రబాబుకి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు.
