సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు నాట అగ్ర నిర్మాతగా భాసిల్లుతున్న అల్లు అరవింద్ అంటే భారతీయ సినీ పరిశ్రమకు బాగా తెలుసు.. గతంలో తెలుగు డబ్బింగ్ తో సూర్య హీరోగా గజని , హిందీ రీమేక్ తో అమీర్ ఖాన్ హీరోగా గజని బంపర్ హిట్స్ అల్లు అరవింద్ సాధించిన విజయం సామాన్యమైనది కాదు.. మరో గజని’ సినిమాకు స్వేక్వల్ గా దశాబ్దం తరువాత అయన సన్నాహాలు చేస్తున్నారు. కంగువ ప్రమోషన్లో బిజీగా ఉన్న ఈ హీరో సూర్య.. గజినీ సీక్వెల్ ప్రపోజల్‌ను అల్లు అరవింద్ తన దగ్గరికి తీసుకొచ్చాని ఈ వార్తను ధ్రువీకరించారు. అయితే ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ..సూర్యను దక్షిణాది కి మాత్రమే పరిమితం చేసి అమీర్‌తో హిందీ లో కూడా ఒకేసారి షూటింగ్ కంప్లీట్ చేసి.. గజినీ సీక్వెల్‌ను రిలీజ్ చేసేలా అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని ..మరో ట్విస్ట్ గా ఈ ఇద్దరు హీరోలు హిందీ, తెలుగు గజనీలలో మరో అతిధి పాత్రలలో నటించేలా ప్లానింగ్ తో అతి త్వరలో గజని సెట్స్ పైకి రాబోతున్నట్లు సమాచారం.
