సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 4గంటల సుదీర్ఘ వాదనల తరువాత అల్లు అర్జున్‌కు నేడు, శుక్రవారం సాయంత్రం హైకోర్టులో భారీ ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ లభించింది. నేటి మధ్యాహ్నం పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించారు. దానితో అల్లును జైలు కు తరలించారు. దీంతో మాజీ సీఎం జగన్ కేసులు వాదించే న్యాయవాది , వైసీపీ రాజ్య సభ సభ్యుడు ( ఎంపీ) నిరంజన రెడ్డి వెంటనే అల్లు అర్జున్ తరపు రంగంలోకి దిగి.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని, చెయ్యని తప్పుకు బాద్యుడిని చేస్తున్నారని తన క్లైంట్‌పై పెట్టిన కేసు కొట్టేయాలని 118 (1) బీఎన్‌ఎస్ అల్లు అర్జున్‌కు వర్తించదని. తన క్లైంట్‌కు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని, తక్షణమే బెయిల్ ఇవ్వాలని అల్లు తరపున నిరంజన్ రెడ్డి వాదించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మాత్రం .. ఈ కేసుపై సోమవారం విచారణ జరపాలని, అత్యవసర విచారణ అవసరం లేదని ( అప్పుడు అల్లు అర్జున్ కనీసం సోమవారం వరకు 4 రోజులు జైలులో ఉంటాడు). అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం లాయర్ నిరంజన్ రెడ్డి వాదనతో ఏకీభవించి అల్లు అర్జున్ నటుడు అయిన అతనికి కొంత స్వేచ్ఛ హక్కు ఉంటుందని ఆ మహిళా మృతికి పూర్తిగా అతనినే పోలీసులు బాద్యుడిని చెయ్యడం సమంజసం గా లేదని క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ తక్షమే బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయ్యారు. మాజీ సీఎం జగన్ కూడా చెయ్యని తప్పుకు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చెయ్యడం కరెక్ట్ కాదని దీనిని ఖండిస్తున్నానని మధ్యాహ్నం ట్విట్ చేసారు.
