సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), అట్లీ (Atlee)కాంబోలో సైన్స్ ఫిక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. స‌న్ పిక్చ‌ర్స్ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో అల్లు అర్జున్ విభిన్న గెటప్ లో సూప‌ర్ హీరోగా క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న దీపిక ప‌దుకునే తో స‌హా మ‌రో న‌లుగురు హీరోయిన్స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తోన్నారు. ఈ సినిమాకు సంబంధించి నేడు,బుధ‌వారం, (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ‘ రాకా” (Raaka) అంటూ తెలుపుతూ పేరును అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ క్ర‌మంలో ఫొటోలో అల్లు అర్జున్ గుండుతో చేతి వేళ్ల మ‌ధ్య నుంచి చూస్తు ఉన్న ఓ ఫొటో విడుద‌ల చేశారు.నిర్మాత‌లు ఇచ్చిన ఈ ప్ర‌క‌ట‌న‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. కొత్త గెటప్ లో అల్లు అర్జున్ ఫొటో, సినిమా పేరు రాకా జాతీయ స్థాయిలో సోష‌ల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *