సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అదేమిటో గతంలో ఎందరో నేతలు, సినీ హీరోల సభలకు వచ్చిన జనం త్రొక్కిసలాటలో అనేక మంది చనిపోయిన తరువాత కొంతకాలానికి ఎవరిమీద కేసులు లేకపోవడం బాధిత కుటుంబాలను కంటితుడుపు చర్యలతో సరిపెట్టడం తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సార్లు చూసాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు’ లోని అల్లు వారి అబ్బాయి ఇప్పుడు పుష్ప 2 తో ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన హీరో అల్లు అర్జున్ ను మాత్రం సంధ్య థియేటర్‌‌లో తోపులాట ఘటనకు, పరోక్షంగా రేవతి మృతి కి కారణమైన కేసు మాత్రం అల్లు అర్జున్ ను వదలటం లేదు.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ కొంత దూకుడు వ్యవహారశైలి వల్ల ఎందరో దురాభిమానులు శత్రువులు పెరిగారు.( అక్కడికి సినిమాలో ‘బాస్.. పావలా’ డైలాగ్స్ తొలగించారు) అయితే 2000కోట్ల దిశగా అడుగులు వేస్తున్న పుష్ప 2 అల్లు అర్జున్ కు ఏపీలో వైసీపీ , తెలంగాణాలో బి ఆర్ ఎస్ , బీజేపీ నేతలు మద్దతు పలుకుతున్నారు. నిన్నటి అసెంబ్లీ లో సీఎం రేవంత్ , మజ్లీస్ పార్టీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. తగ్గేదే లే.. అన్నట్లుగా వ్యవహరించారు. ఈ కేసులో వివిధ పార్టీల రాజకీయాలు పెరిగాయి. రేవతి మృతి కి కారణమంటూ ఓయూ జేఎసీ ఆధ్వర్యంలో నేడు, అల్లు అర్జున్ ఇంటిముందు ఆందోళణ నిర్వహించారు. ఇంటి లోపలకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. కొందరు దుండగులు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు. రేవతి కుటుంబానికి తక్షణమే అల్లు అర్జున్ రూ.కోటి సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనకారులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *