సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పుష్ప 2 సినిమాతో భారత దేశం సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ వసూళ్లు (2000 కోట్ల దిశగా)సాధించిన హీరోగా అల్లు అర్జున్ ఖ్యాతి ఖండాంతరాలు దాటితే .. హైదరాబాద్ లో సంధ్య థియేటర్స్ వద్ద మహిళా మృతి విషాద ఘటన కు పరోక్ష కారకుడుగా కేసు మరోపక్క వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో తాజగా నాంపల్లి కోర్టులో కాస్త ఊరట లభించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇటీవలే వాదనలు గత శుక్రవారం తో ముగియగా నాంపల్లి కోర్టు తీర్పును వెల్లడించింది. రూ. 50వేల రెండు పూచీకత్తులను సమర్పించాలని, పోలీసుల విచారణకు సహకరించాలని, ప్రతి ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా.. ఇప్పటికే మృతురాలు రేవతి కుటుంబానికి పుష్ప 2 టీమ్ రూ.2 కోట్ల సాయం అందించింది. అల్లు అర్జున్ కోటి రూపాయలు , పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షలు అందించారు.
