సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2′ (Pushpa 2) ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే 250 కోట్ల రూపాయలు పైగా వసూళ్లు సాధించిన సినిమాగా సంచలన విజయాన్ని సాధించి మరోసారి తెలుగు వాడి సత్తా చాటారు. అయితే పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌లో అల్లు అర్జున్ ను చూడటానికి వేలాది అభిమానులలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళా మృతి చెందారు. ఆమె కుమారుడు త్రోపులాటలో నలిగిపోయి సొమ్మసిల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే హీరో అల్లు అర్జున్ అక్కడికి వస్తున్న విషయంపై తమకు ముందుగా ఎవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బిఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కానీ ప్రాణ నష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇకపై తెలంగాణ లో ఏ సినిమాకు బెనిఫిట్ షో లకు అవకాశం ఇవ్వమని తాజాగా ప్రకటించింది.
