సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల మెగా అభిమానులు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం తో అల్లు అర్జున్ ఆర్మీ సైతం మెగా అభిమానుల మీద ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఇక ఇదే విషయం మీద నిన్న, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అతను పెద్ద భూడింగ్,, తన తండ్రి అల్లు అరవింద్ ని ఎంపీగా గెలిపించుకోలేకపోయాడు, అయినా అల్లుకి అభిమానులు ఏమిటి? ఉన్నది మెగా అభిమానులే కదా ?అని అర్థం వచ్చేలా ఆయన కామెంట్స్ చేసిన ఆయన ఇప్పుడు ఆ విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. ఇక ఇప్పటికే ఒక ట్వీట్ డిలీట్ చేసిన ఆయన ఇప్పు డు అల్లు అర్జున్ కి, మాకు మా పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదని తెలిపారు. నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడదలచుకోలేదు. నిన్న నన్ను అడిగారు దానికి సమాధానం చెప్పాను, అయిపోయింది. వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పు డు మనం మాట్లాడాలి కానీ ఊరికే మనం మాట్లాడటం భావ్యం కాదు. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే మీరు అడగండి అప్పుడు నేను కౌంటర్ ఇస్తాను అంటూ ఆయన కామెం ట్ చేశారు. అయితే తాజగా అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వ యకర్త చలమల శెట్టి రమేష్ బాబు మండిపడ్డారు. మీడియాతో చలమలశెట్టి రమేష్బాబు మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా? కమెడియన్ మాత్రమే, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు, వారిని విమర్శించే స్థాయి నీకు లేదు అని అన్నారు.
