సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘పుష్ప2; రిలీజ్ నుండి హీరో అల్లు అర్జున్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి పెరిగిన దూరం తాజాగా దగ్గరయింది. హైదరాబాద్ లోని కోకాపేటలో అల్లు సినిమాస్ ను అల్లు అరవింద్ ఫ్యామిలీ. ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీతో దీనిని రూపొందించారు. ఈ సందర్భంగా ఆనందంతో తబ్బిఉబ్బి అయిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలోనే ‘అతిపెద్ద డాల్బీ’ సినిమాను ప్రారంభించినందుకు అల్లు కుటుంబానికి, అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ కు ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. అల్లు రామలింగయ్య గొప్ప వారసత్వాన్ని అల్లు అరవింద్ కొనసాగిస్తున్నారని, కొనియాడారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం హైదరాబాద్ నగరానికి, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ థియేటర్స్ తో సినిమా పరిశ్రమకు గొప్ప గుర్తింపు తెస్తుందని అన్నారు. సినీ రంగంలో నటశేఖర కృష్ణ గారు ఎన్నో ప్రయోగాలు చేశారు. కలర్ సినిమా, 70MM.. ఇలా తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి అడ్వెంచర్స్ చేయాలంటే ఆరోజుల్లో కృష్ణ గారి ముందుండేవారు. హైదరాబాద్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి చాలా ఎఫర్ట్ పెట్టారు. అప్పట్లో కృష్ణ ఒక ఏడాదిలో 15-16 సినిమాల్లో నటించి రిలీజ్ చేసేవారు. ఇప్పుడు ఐదారు సంవత్సరాలకు ఒక సినిమా తీసే పరిస్థితి వచ్చింది. నేను కృష్ణగారి వీరాభిమానిని. అందుకే ఈ వివరాలన్నీ నాకు తెలుసు. ఆయన సినిమా మొదటి రోజు చూడటానికి నేను లారీ ఎక్కి 100 కిలో మీటర్లు ప్రయాణించిన రోజులు ఉన్నాయి.” ఇది పెద్ద స్క్రీన్‌లపై. ఈ డాల్బీ థియేటర్ 500-700 సీటింగ్ కెపాసిటీతో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిస్తుందని, భవిష్యత్తులో అల్లు అర్జున్ పాన్ ఇండియానే కాకుండా, హాలీవుడ్‌లో కూడా రాణించాలని, అక్కడికి కూడా మన సినిమా రీచ్ అవ్వాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *