సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వాతంత్ర్య పోరాటయోధుడు అల్లూరి సీతారామారాజు (Alluri Sitarama Raju ) జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ (Nara lokesh) నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ..‘భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో బ్రిటీష్ వారికి సింహస్వప్నంగా నిలిచిన గొప్ప పోరాటయోధుడు అల్లూరి సీతారామ రాజు. మన్యంలో పోరాట వీరులను తీర్చిదిద్ది.. బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం పునరంకితం అవుదాం’ అని లోకేష్ అన్నారు. అలాగే జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య , ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకనంద వర్థంతిని పురస్కరించుకుని ఇరువురు మహనీయులకు మంత్రి లోకేష్ ఘన నివాళులు అర్పించారున్నారు.
