సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరుణ సాంఘిక పేరుతో గోదావరి సంగమంను భారీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నేడు, సోమవారం జరిగిన సమావేశంలో జాతీయ ప్రముఖులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ(Rss) చీఫ్, డాక్టర్ మోహన్ జీ భాగవత్ ముందుగా చత్రపతి శివాజీ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ.. హిందుత్వంలో ఉండే సత్యం కరుణ పవిత్రత పరిశ్రమ తపస్సు వీటి ఆధారంగా అందర్నీ కలుపుతూ మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని తెలిపారు. దేశవ్యాప్తంగా 75వ అ అమృత మహోత్సవాలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సంగ్రామంలో బలిదానం అయ్యారని గుర్తుచేశారు అల్లూరి స్ఫూర్తి యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తూ అటువంటి వ్యక్తులకు మనందరం వారసులుగా ఉన్నామని తెలిపారు. సంపూర్ణ హిందూ సమాజాన్ని సంఘటిత పరుస్తూ ఈ దేశం వైభవం స్థితికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేయాలని వ్యాఖ్యానించారు. నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ అధినేత అల్లూరి వెంకట నరసింహ రాజు మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం చాలా గొప్పదని అభివర్ణించారు క్షేత్ర సహ సంఘచాలక్ దూసి రామకృష్ణ ,ప్రాంత సంఘచాలక్ నాగ రెడ్డి హరి కుమార్ రెడ్డి ,ప్రాంత సహ సంఘచాలక్ సుంకవల్లి రామకృష్ణ, భీమవరం విభాగ్ సంఘచాలక్ మంతెన రామచంద్రరాజు, తదితరులు పాల్గొన్నారు.
