సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం తాలూకా మోగల్లు గ్రామంలో జన్మించి, భీమవరంలోనే చిన్ననాటి విద్య ను పూర్తిచేసి తదుపరి రెండుపదుల వయస్సులోనే విశాఖ మన్యం వీరుడుగా భారత స్వతంత్ర పోరాటంలో బ్రిటీష్ దొరలను ఎదిరించిన పోరాట బాడబాగ్ని.. అల్లూరి సీతారామరాజు.. భారత 75 వ స్వాతంత్ర దినోత్సవాలు నేపథ్యంలో అల్లూరి.. 125 వ జన్మదినం పునస్కరించుకొని హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిలిం క్లబ్ లో తెలుగు రాష్ట్రాల క్షత్రియ సేవ సమితి ఆధ్వర్యంలో అల్లూరి .. సంస్మరణ సభ ను భారీగా ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా.. అల్లూరి సీతారామ రాజు సినిమా తో అల్లూరి ఇలా ఉంటాడు.. అని భావి తరాలకు గుర్తుండిపోయేలా రామరాజు పాత్రలో లీనమై ప్రాణప్రతిష్ట చేసిన లెజెండ్ సినీ హీరో .. సూపర్ స్టార్ కృష్ణ కు ‘ మహా సన్మానం” కూడా ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ఒక నాటి హీరో కృష్ణ అభిమానులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, ఎం శ్రీనివాసరావు హాజరుకావడం మరో విశేషం. ముఖ్య అతిధిగా భీమవరం బ్రాండ్, మాజీ కేంద్ర మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా హాజరు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *