సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచం గర్వించదగ్గ అద్భుతాలు అనదగ్గ.. ఆబిస్, టైటానిక్ లాంటి సినిమాలు మాత్రమే తీసే హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నుంచి భారతీయ సంసృత పదం టైటిల్ గా వచ్చిన సినిమా ‘అవతార్’ . ‘పండోరా’ అనే గ్రహం వింత మనుషులు , వింత జీవులు , వారి ప్రక్రుతి సంరక్షణ నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండియా తో పాటు ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్స్‌ను కొల్లగొట్టిన మూవీగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్స్ 2,3,4 కోసం జేమ్స్ కామెరూన్ దశాబ్దకాలంగా పనిచేస్తున్నాడు. తాజాగా రెండో భాగం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ట్రైలర్ విడుదలయ్యింది. నిజంగా అద్భుతం అనిపించింది. ట్రైలర్‌లో జేమ్స్ కామెరూన్ ప్రేక్షకులను తిరిగి పండోరా పైకి తీసుకెళ్లాడుఅవతార్’ లో శామ్ వర్తింగ్‌టన్ కీలక పాత్ర పోషించాడు. మరోసారి పండోరాను విజువల్ వండర్‌గా చూపించాడు. సౌండ్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులకు బోనస్ వినోదాన్ని , అద్భుత ప్రపంచాన్ని చూపిస్తున్నారు. . ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న విడుదల కానుంది. భారత్‌లో ఈ చిత్రం ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 4కె, 3డీ తో పాటు IMAX అందుబాటులో ఉన్న అన్ని ఫార్మాట్స్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
