సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ సినీ అభిమానులుతో పాటు భారతీయ బాషలలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ( Avatar 3 ) నేడు, శుక్రవారం (డిసెంబర్ 19) థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే రెండు భాగాలతో మొదటి భాగం బాక్సాఫీస్ చరిత్ర సృష్టించగా 2వ భాగం కొంత నిరాశ పరచింది. ఇక అవతార్ ఫ్రాంచైజీకి ఇది మూడో చిత్రం కావడంతో ట్రైలర్ సూపర్బ్ గా ఉండటంతో తెలుగురాష్ట్రాలలో ఈ సినిమాకు భారీ క్రేజ్ కనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్‌లైన్ ట్రెండ్స్ చూస్తే అవతార్ 3 ఓపెనింగ్స్ డబ్బింగ్ సినిమాలలో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. ఇక అవతార్ 3 వీక్షించిన ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ టాక్ వినిపిస్తుంది. సీజ్ వర్క్ అద్భుతమని, యాక్షన్ సీన్లు అదరగొట్టారని, అగ్ని కి సంబందించిన సినిమా కాబ్బటి సినిమా మొత్తం కేసరి కలర్ డామినేషన్ తో క్వాలిటీ మంచి అనుభూతిని కలిగిస్తుందని. తెలుగు లో పాత్రదారులకు తగిన వాయిస్ డబ్బింగ్ బాగా కుదిరింది. , కధ విషయానికి వస్తే మరోసారి అవతార్ మొదటి భాగం ఛాయలు కనిపించాయని అయితే బాగోద్వేగాలు తక్కువగా ఉన్నాయని అయితే జేమ్స్ కామెరూన్ మరో అద్భుతం కి తప్పక సినిమా థియేటర్స్ లో పెద్ద తెరపై మాత్రమే చూడదగ్గ అవతార్ 3 కి భారతీయ ఆబాల గోపాలం ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారనే చేప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *