సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచవ్యాప్తంగా 160 బాషలలో డబ్బింగ్ అవుతూ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar The Way Of Water). నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 3గంటల 16 నిమిషాల నిడివి ఉన్నపటికీ ఏ మాత్రం విజువల్ వండర్ గా థియేటర్స్ కు వచ్చే వారి అంచనాలకు తగ్గకుండా అద్భుత ప్రపంచంలో ప్రేక్షకులను విహరింప చేసి మంచి అనుభూతికి గురిచేసింది. అయితే మొదటి సినిమా తో పోలిస్తే పండోర గ్రహవాసుల కుటుంబ నేపథ్యంలో ఎన్నో బాగోద్వేగ భరిత సన్నివేశాలు చుట్టూ కథ అల్లారు. పాత్ర దారులు మాత్రం కొద్దీ మందే ఉండటం..యాక్షన్ సన్నివేశాలు తగ్గించడం.. గత అవతార్ తో పోలిస్తే చిన్న అసంతృప్తి.. మరి ఎంత వరకు ప్రేక్షకులు అందరు వాటికీ కనెక్ట్ అవుతారో కానీ.. సినిమా మొదటి 90 నిమిషాలు అత్యద్భుతమైన విజువల్స్‌తో నిజమనే భ్రమని కలిగించింది. నీటి అడుగున ఉన్న 25 నిమిషాల విజువల్స్ అయితే మరింత అద్భుతంగా ఉన్నాయి.. కొన్ని పాత్రలు మాత్రమే ఉన్నాయి.అయితే అవతార్ 2లో పూర్తి పండోరాని చూపించాడు. దానికి కోసం దర్శకుడు చాలా కష్టపడ్డాడు. సినిమా 3డి లో చూసే ప్రేక్షకులను నీటిలోకి తీసుకెళ్లాడు. నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ కు రాసిన మాటలు నిజంగా మరో ప్లస్ పాయింట్. అది సినిమాకి జీవాన్ని ఇచ్చింది. ఒక్కమాటలో సినిమా అంత కలపి..ఇది స్వచ్ఛమైన జేమ్స్ కామెరూన్ సినిమా మ్యాజిక్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *