సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ కు బాబాయ్ అయిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు లో వాదనలు జరిగాయి. వాదనలు విన్న హైకోర్టు సోమవారం వరకు అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హార్డ్ డిస్క్‌లో వీడియోగ్రఫీ, ఆడియోలను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లెటర్‌ను, అవినాష్ రెడ్డి కేసు వివరాలు మొత్తం సమర్పించాలని సీబీఐ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ ఎస్పీ ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కోర్టుకు వచ్చి అవినాష్ రిట్ ఫిటిషన్‌పై కౌంటర్ ధాఖలు చేశారు. అనంతరం హైకోర్టు సోమవారం వరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్‌రెడ్డికి కొంత ఊరట లభించింది.
