సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో 2న్నరదశాబ్దాలు పైగా తిరుగులేని అగ్ర రాజకీయ నేతగా, ఎమ్మెల్యే గా , మంత్రిగా, ఎంపీగా జిల్లా టీడీపీ, కాంగ్రెస్ , వైసీపీ పార్టీల అడ్జక్షుడిగా చక్రం త్రిపిన కొత్తపల్లి సుబ్బారాయుడు కొన్ని స్వయం కృత నిర్ణయాలతో రాజకీయాలలో వెనుకబడిన విషయం అందరికి విదితమే.. అయితే అయన రాజకీయాలలో పునర్ వైభవం కోసం మరో ప్రయత్నం జనసేన ద్వారా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు, గురువారం సాయంత్రం నరసాపురం లోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. త్వరలోనే తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మంచి ఆశయాలు, సిద్ధాంతాలు, కమిట్మెంట్ ఉన్న గొప్ప నాయకుడని జనసేన లో పనిచెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని త్వరలో పవన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *