సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం నేడు, శుక్రవారం భారతరత్న అవార్డు ప్రకటించింది. మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌లకు సైతం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా ఇటీవలే.. ఎల్ కే అడ్వాణీ, కర్పూరీ ఠాకూర్‌కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రికార్డు స్థాయిలో మొత్తం ఐదుగురికి ఈ ఏడాది 5 భారతరత్న అవార్డులు ప్రకటించినట్టయ్యింది. సాధారణంగా ఏడాదికి 3 భారతరత్న అవార్డులు ఇస్తారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం ఐదుగురికి ప్రకటించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు.. , సమర్ధ ప్రధాని గా, బహుభాషా కోవిదుడు తెలుగు వాడైన పీవీ నరసింహారావు కు ప్రధాని గా ఎటువంటి అదనపు గౌరవం దక్కకుండా చెయ్యాలని చేసిన అనేక తప్పిదాలకు ఇదో గుణపాఠం గా భావించాలి.
