సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ లో నేడు, సోమవారం సభలో సీఎం, మంత్రులు ఎమ్మెల్యే లకు సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అధికారిక ప్రకటన చేశారు. ఎవరు ఎక్కడ కూర్చుని మాట్లాడాలో ఆ సీట్లు వారికీ కేటాయించారు. ట్రెజరీ బెంచ్‌గా ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లు కేటాయించారు. అనంతరం చీఫ్ విప్, విప్ లకు సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆపై ఎమ్మెల్యే లకు వారి సీనియారిటీ నేపథ్యంలో వారి కుర్చీలను కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు 1 నెంబరు సీట్ కేటాయించగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు 39 నెంబరు సీట్‌ను కేటాయించడం విశేషం.. ఇక మాజీ ముఖ్యమంత్రిగా, వైసీపీ పక్షనేతగా ఉన్న వైఎస్ జగన్ కి ప్రతిపక్ష బెంచ్‌లో ముందు వరుస సీట్ కేటాయించడం విశేషం. నేటి సోమవారం సభలో సభ్యులు గాజువాక ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాస్ నిషేదిత డ్రగ్స్ మాఫియా అంశం ప్రస్తావనకు తెచ్చినప్పుడు స్పీకర్ స్థానంలో రఘురామా దానిపై స్వాందిస్తూ .. యువత ను వారి శక్తి యుక్తులను నిర్వేర్యం చేస్తున్న ఈ మాదకద్రవ్యాల విషయంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు – వాటిని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసే అవకాశాలపై అధ్యయనం చేస్తే బాగుంటుంది అని, తద్వారా రాబోయే కొన్ని తరలను కాపాడుకోవచ్చునని రాష్ట్ర హోం శాఖా మంత్రి అనితకు సూచించారు.
