సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీలో 2వ రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా.. సీఎం జగన్ నుద్దేశించి సైకో పాలన పోవాలి అంటూ నినాదాలు చేసారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే ఒక అడుగు ముందుకువేసి అసెంబ్లీలో తన సీటుపై నిలబడి విజిల్స్ వేస్తూ నిరసన తెలిపారు. దీనిపై పలువురు మంత్రులు క్రమశిక్షణ లేదా? అంటూ బాలకృష్ణ ను దూషించారు. వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి మాట్లాడుతూ.. . అసలు బాలకృష్ణను అసెంబ్లీ లోపలికి రానివ్వొద్దని.. ఆయనకు మెంటల్’ అని దానిని ధృవీకరిస్తూ డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఉందన్నారు.. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. బావ జైల్లో… అల్లుడు ఢిల్లీలో ఉన్నారు. ఇక్కడ గతంలో ఎప్పుడూ లేనంతగా యాక్టివ్‌గా బాలకృష్ణ యాక్టివ్‌గా ఉన్నారు. నిన్న మీసం త్రిప్పి తొడలు చరిచారు..మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండి. జన్మనిచ్చిన తండ్రికి, క్లిష్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది. ఈ రోజయితే బాలకృష్ణ సభలో బావ సీటు ఎక్కి ఆందోళన చేస్తున్నారు. ఆ సీటు చంద్రబాబు కు కేటాయించింది. బాలకృష్ణ చంద్రబాబు సీటుపై కాదు చంద్రబాబుపైనే ఎక్కి కుర్చోవాలి అని చాల సార్లు చెపుతున్నాం. బావ అవినీతి కేసులు లో ఆధారాలతో సహా దొరికేసాడు కాబ్బటి వారికి చర్చల్లో పాల్గోనే దమ్ము లేదు . వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావు. సింగిల్ అంకెతోనే సభలోకి వస్తారు. బాలకృష్ణ కూడా రారు.. ఆయన ప్లూటు, విజిల్ ఇంటి వద్దే ఊదుకోవాలి’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు యెద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *