సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని యనమదుర్రు డ్రెయిన్ ను ప్రక్షాళన చేయాలని, సూవిస్ పని చేయకపోవడంతో వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. నేడు సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. తరుచు యనమదుర్రు కాల్వ వరదలకు కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించి నష్ట పరిహారాలు కూడా అందిస్తున్నామని, 60 కీమీ పొడవు గల యనమదుర్రు డ్రెయిన్ గోదావరి అంతా వేగంగా ప్రవహిస్తూ ఉంటుందని అన్నారు. కిక్కుసు, గుర్రపుడెక్క కూడా పట్టేస్తుందని, ప్రక్షాళన అవసరమని అన్నారు. కెనాల్ లకు వంతెన లను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు యనమదుర్రు కాల్వ సమస్య పరిష్కారానికి కృషి చేద్దామని సమాధానం ఇచ్చారు.
