సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు, సోమవారం ఉదయం నుండి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు అడ్జక్షతన కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో సభ్యులకు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు సభలో కొందరు సెల్ ఫోన్ వినియోగిస్తున్నారని, ఎవరు సెల్ ఫోన్ లు మాట్లాడవద్దని క్రమశిక్షణ పాటించాలని ఫోన్లు సైలెంట్ మోడ్ లో పెట్టుకోవాలని సూచించారు. మీకు అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ తో సభ బయటకు వెళ్లి మాట్లాడాలని సూచించారు. ఇది నా విజ్ఞప్తి అని.. విజ్ఞప్తులు ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటాయని రఘురామ నర్మగర్భంగా హెచ్చరించారు. అయితే సెల్ ఫోన్ లు కు సిగ్నెల్స్ రాకుండా అసెంబ్లీలో జామర్లు పెట్టాలన్న ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సూచనతో రఘురామా మాట్లాడుతూ.. మన బలహీనత జామర్లపైకి నెట్టవద్దని చురక వేశారు. నిజానికి రఘురామా భీమవరంలో మీడియా సమావేశాలలో కూడా మీడియా ప్రతినిదులు ఇదే సూచన చేసి తన ప్రెస్ మీట్ మొదలు పెట్టడం, మధ్యలో రింగ్ టోన్ మోగితే అసహనానికి గురికావడం అందరికి తెలిసిందే..
