సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశ మందిరంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేషన్ కమిటీ, పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ.. మూడు ప్రజా పద్దుల కమిటీలతో ప్రాధమిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మెన్ గా పులపర్తి అంజిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, అసెంబ్లీ కార్యకలాపాల్లో కమిటీ సభ్యులందరూ చురుకుగా పాల్గొనాలని, ప్రజా పద్దుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అలాగే, నెలలో కనీసం రెండుసార్లు కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర , మూడు కమిటీల చైర్మన్ లు , సభ్యులు పాల్గొన్నారు.
