సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీలో తొలిరోజు సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళటం స్కిల్ కుంభకోణం ఫై సభలో ఉన్న కొద్దీ మంది టీడీపీ ఎమ్మెల్యే ల దూకుడు తో వైసిపి ఎమ్మెల్యే ల హెచ్చరికల మధ్య రచ్చ జరిగింది. స్పీకర్ తమ్మినేని పోడియంను టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణతో సహా చుట్టుముట్టారు. కార్డ్స్ చూపిస్తూ చంద్రబాబు అరెస్ట్ ఫై నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్ద వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ కు దూరంగా ఉండాలని, చంద్రబాబు ఏమీ అవినీతి చేసాడు ఎందుకు శిక్ష పడింది ఆధారాలతో సహా సభలో చర్చకు సిద్దమంటుంటుంటే.. మీరు చర్చ కు బయపడి ఇలా చెయ్యడం భావ్యం కాదన్నారు. ఇంతలో స్పీకర్ పోడియం వద్ద నుండి హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసాలు త్రిపి తొడ కొట్టి చూసుకొందామా? అని సినిమా తరహాలో డైలాగ్ కొట్టారు. దానితో మీసాలు తిప్పడం వంటివి సినిమాల్లో చూపించుకోవాలని ఇక్కడ అసెంబ్లీలో కాదని అంబటి తనదయిన శైలిలో ఎద్దేవా చేసారు.. దీంతో ఫైర్ అయిన బాలకృష్ణ ‘చూసుకుందాం రా’ అంటూ అంబటికి సవాల్ విసిరారు. అంబటి సైతం తీవ్ర కోపంతో ఏంటి రెచ్చగొడ్డుతున్నావ్? సినిమా అనుకుంటున్నావా? ‘రా చూసుకుందాం’ అని ప్రతి సవాల్ విసిరారు. దీంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాలయ్య పైకి.. సన్నద్ధం కావడం తో live ఆపేసారు.( ఈ దశలో దూసుకొనివస్తున్న వైసిపి ఎమ్మెల్యే లకు స్పీకర్ తమ్మినేని లేచి నిలబడి నమస్కారం పెట్టి ఆపినట్లు తెలుస్తుంది.. ) తదుపరి కొద్దీ క్షణాలు తరువాత.. పరిస్థితి గమనించిన స్పీకర్ తమ్మినేని, బాలయ్య ను తొడలు చరుచుకోవడం వికృత చేష్టగా భావిస్తూ.. మొదటి తప్పులాగా క్షమిద్దామని మరోసారి ఇలా చేస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. సభను కొద్దీ సేపు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *