సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం మధ్యాహ్నం మాజీ సీఎం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అసెంబ్లీ లో గత నా పాలనలో జరిగిన అభివృద్ధి ని త్రొక్కి పెడుతూ నా హయాంలో తీసుకోని వచ్చిన పరిశ్రమలు పెద్ద సంస్థల తో జరిగిన ఒప్పందాలు ఇప్పడు తమ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నట్లు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని గత నాలుగు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందనగా తప్పుడు లెక్కలతో బడ్జెట్ ప్రవేశపెట్టారని, ముఖ్యంగా బడ్జెట్ చూస్తే బాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తున్నట్లు కనిపిస్తోందని, హామీలు ఎగొట్టడానికి బాబు అబద్ధాలకు రెక్కలు కట్టారంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు అన్నీ వక్రీకరించి అబద్ధాలు చెబుతున్నారన్నారు. బాబు హయాంలో కన్నా వైఎస్సార్‌సీపీ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందని జగన్ స్పష్టం చేశారు. జాతీయ సగటు కన్నా ఏపీ సగటు వృద్ధి రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. లేని అప్పులు ఉన్నట్టుగా అబద్ధాలకు రెక్కలు కట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా లక్షా 30వేలు ఉద్యోగాలు ఇచ్చామని, అదికాక ఆర్టీసీలో 50 వేల ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, ఆర్టీసీ కార్మికుల్లో వెలుగులు నింపామన్నారు. 2.66 లక్షల వలంటీర్ల నియామకాలు చేశామన్న జగన్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని జగన్ ప్రశ్నించారు.ఆరోగ్యశ్రీ చికిత్సలు పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచామన్నారు. గత 4 నెలల నుంచి జీతాలు అందడం లేదని 108 ఉద్యోగాలు ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు.
